ఫ్యూయల్ ట్యాంక్ పేలి ఇద్దరు మృతి
- January 08, 2021
కువైట్: కువైట్ లోని పారిశ్రామిక ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఇంధనం ట్యాంక్ పేలి ఇద్దరు మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. షువైఖ్ ప్రాంతంలోని పారిశ్రామిక వాడలో ట్యాంక్ కు వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ట్యాంకర్ 30 మీటర్ల దూరంలోని వంతెన దగ్గర పడింది. దీన్ని బట్టి పేలుడు తీవ్రతను అంచనా వేయవచ్చు. ప్రమాదం గురించి సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. అయితే..ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు, గాయపడిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







