తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- January 09, 2021
హైదరాబాద్:తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోయింది... రోజువారి కేసుల సంఖ్య 300 దిగువకు పడిపోయింది.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో 298 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు మృతిచెందారు. ఇదే సమయంలో 474 మంది కోలుకున్నారు. దీంతో...కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,89,433కు చేరుకోగా... 2,83,048 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,563 మంది కరోనాతో మృతిచెందారు. ఇక, తెలంగాణలో కరోనా మృతుల శాతం 0.54 శాతంగా ఉంటే.. దేశవ్యాప్తంగా 1.4 శాతంగా ఉందని.. రాష్ట్రంలో రికవరీ రేటు 97.79 శాతంగా ఉంటే.. భారత్‌లో 96.4 శాతంగా ఉందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్రంలో 4,822 యాక్టివ్ కేసులు ఉండగా... వీరిలో 2,614 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 31,187 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా... ఇప్పటి వరకు చేసిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 72,15,785కు చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







