ఏ.పీ:దేవాలయాల దాడులపై సిట్
- January 09, 2021_1610170553.jpg)
అమరావతి:ఏ.పీ రాష్ట్రంలో దేవాలయాలపై దాడులపై సిట్ ను ప్రభుత్వం నియమించింది. గతేడాది సెప్టెంబర్ నుంచి జరుగుతోన్న దాడులపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటయింది. కృష్ణాజిల్లా ఎస్పీ రవీంధ్రనాథ్ బాబుతోపాటు 16 మంది సభ్యులు ఈ సిట్ లో ఉండనున్నారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, నలుగురు ఎస్సైలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు కానుంది. అన్ని జిల్లాల ఎస్పీలు ఈ బృందానికి సహకరించాలని, సీఐడీ, ఇంటెలిజెన్స్ బృందాలు కూడా సిట్ బృందానికి సహకరించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కేసుల తీవ్రత దృష్ట్యా సైబర్ క్రైమ్ విజయవాడ, విశాఖపట్నం బృందాలు సిట్ బృందానికి సహకరించాలని, సిట్ బృందం ఎప్పటికప్పుడు కేస్ దర్యాప్తు పురోగతిని శాంతిభద్రతల అడిషనల్ డీజీకి వివరించాలని పేర్కొంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష