యువతను తీవ్రవాదం నుంచి రక్షించాలి
- February 22, 2016
బహ్రెయిన్‌లో యువతను తీవ్రవాదం నుంచి రక్షించాల్సి ఉందని ఇన్ఫర్మేషన్ మరియు పార్లమెంట్ ఎఫైర్స్ మినిస్టర్ ఇసా అబ్దుల్ రహమాన్ అల్ హమ్మాదీ చెప్పారు. యువతను పెడతోవలో నడిపించేందుకు తీవ్రవాద సంస్థలు, అసాంఘీక శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. 14 నుంచి 18 ఏళ్ళ వయసున్న వారు విదేశాలకు వెళ్ళినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు వారిని జాగ్రత్తగా పరిశీలించాలనీ, వీరినే ఎక్కువగా తీవ్రవాదులు ఫోకస్ చేస్తున్నారని అబ్దుల్ రహమాన్ వెల్లడించారు. పార్టీలు, కుటుంబం, కమ్యూనిటీ ఇలాంటి వారి పట్ల పూర్తిస్థాయి అవగాహనతో ఉండాలని, సమాజం పట్ల బాధ్యతను వారికి నేర్పించాలని కోరారు అబ్దుల్ రెహమాన్. తీవ్రవాద సంస్థల్లో చేరుతున్న బహ్రెయినీ యువత శాతం మిగతా దేశాలతో పోల్చితే తక్కువేనని అన్నారు. అయినప్పటికీ ఇంకా జాగ్రత్తగా యువతను చెడు మార్గంలోకి వెళ్ళకుండా చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







