ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు
- February 22, 2016
భారత దేశ పురోభివృద్దిని, ప్రజా సంక్షేమాన్ని నిర్ణయించే బడ్జెట్ 2016-17 సమావేశాలు పార్లమెంట్ లో నేడు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం అఖిల పక్ష నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశాలు సజావుగా సాగాలని, ఆందోళనల వల్ల క్వశ్చన్ అవర్ నష్టపోకుండా చూడాలంటూ పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని తెలిపారు. రిజర్వేషన్ల వ్యవస్థ, జేఎన్‌యూ వివాదం నేపథ్యంలో వర్సీటీల నిర్వాహన్పై చర్చించాలంటూ విపక్షాలు కోరాయని తెలిపారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సెంట్రల్ హాల్లో ఉదయం 11 గంటలకు ప్రసంగించనున్నారు. బుధవారం 25న రైల్వే బడ్జెట్‌ను మంత్రి సురేశ్ ప్రభు పార్లమెంటుకు సమర్పించనున్నారు.26న ఆర్థిక సర్వేను, 29వ తేదీన సాధారణ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సమర్పించనున్నారు. వచ్చే వారం లోక్ సభ లో చర్చించాల్సిన అంశాలపై ఈ రోజు మధ్యాహ్నం జరిగే బీఏసీసమావేశంలో అజెండా రూపొందిస్తామని తెలిపారు.ఈ సమావేశాల్లో మొత్తం 74 బిల్లులపై చర్చ జరుగనుంది. ఇందులో 62 శాసనాలకు సంబంధించినవికాగా, 12 మాత్రం ద్రవ్య సంబంధమైనవి. కొత్తగా నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న 11 బిల్లులపైనా చర్చను చేపట్టనుంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!







