ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు

- February 22, 2016 , by Maagulf
ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు

భారత దేశ పురోభివృద్దిని, ప్రజా సంక్షేమాన్ని నిర్ణయించే బడ్జెట్ 2016-17 సమావేశాలు పార్లమెంట్ లో నేడు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం అఖిల పక్ష నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశాలు సజావుగా సాగాలని, ఆందోళనల వల్ల క్వశ్చన్ అవర్ నష్టపోకుండా చూడాలంటూ పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని తెలిపారు. రిజర్వేషన్ల వ్యవస్థ, జేఎన్యూ వివాదం నేపథ్యంలో వర్సీటీల నిర్వాహన్పై చర్చించాలంటూ విపక్షాలు కోరాయని తెలిపారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సెంట్రల్ హాల్‌లో ఉదయం 11 గంటలకు ప్రసంగించనున్నారు. బుధవారం 25న రైల్వే బడ్జెట్‌ను మంత్రి సురేశ్ ప్రభు పార్లమెంటుకు సమర్పించనున్నారు.26న ఆర్థిక సర్వేను, 29వ తేదీన సాధారణ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సమర్పించనున్నారు. వచ్చే వారం లోక్ సభ లో చర్చించాల్సిన అంశాలపై ఈ రోజు మధ్యాహ్నం జరిగే బీఏసీసమావేశంలో అజెండా రూపొందిస్తామని తెలిపారు.ఈ సమావేశాల్లో మొత్తం 74 బిల్లులపై చర్చ జరుగనుంది. ఇందులో 62 శాసనాలకు సంబంధించినవికాగా, 12 మాత్రం ద్రవ్య సంబంధమైనవి. కొత్తగా నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న 11 బిల్లులపైనా చర్చను చేపట్టనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com