శ్రీను వైట్ల హీరో వరుణ్ తేజ్
- February 23, 2016
ఆగడు, బ్రూస్ లీ సినిమాల ఫెయిల్యూర్స్ తో కష్టాల్లో పడ్డ శ్రీను వైట్ల ప్రస్తుతం తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. స్టార్ హీరోలతో సినిమా చేయడానికి ప్రయత్నించినా ఇప్పట్లో ఎవరూ డేట్స్ ఇచ్చే ఛాన్స్ కనిపించకపోవటంతో ఇక యంగ్ హీరోల మీద దృష్టి పెట్టాడు. తన మార్క్ కామెడీ సబ్జెక్ట్ తో తిరిగి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు.ఇన్నాళ్లు రామ్ తో సినిమా చేయడానికి వెయిట్ చేసిన శ్రీను వైట్ల, రామ్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో మరో హీరో కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. లోఫర్ సినిమా తరువాత ఇంత వరకు సినిమా స్టార్ట్ చేయని వరుణ్ తేజ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే శ్రీను వైట్ల చెప్పిన కథ నాగబాబు, వరుణ్ లకు నచ్చిందన్న టాక్ వినిపిస్తోంది.మరి వరుణ్ తో అయినా శ్రీను వైట్ల సినిమా పట్టాలెక్కుతుందేమో చూడాలి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







