'రెడ్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
- January 12, 2021
హైదరాబాద్:యంగ్ అండ్ డైనమిక్ హీరోలలో రాం పోతినేని ఒకడు. తన తొలి చిత్రం దేవదాసుతోనే విజయం అందుకున్న రాం. వరుస సినిమాలు చేసి మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అగ్ర హీరో కాకుపోయినా టాలెంటెడ్ హీరోగా తెలుగు చిత్ర సిమలో నిలిచాడు. రామ్, పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ ఆ సినిమాలో ఫూల్ మాస్ పాత్రతో అందరిని ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు రామ్ మరో మాస్ అండ్ క్లాస్ సినిమా రెడ్‌లో నటించాడు. ఈ సినిమా గతేడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ చిత్రంలో రామ్ రెండు పాత్రలలో చేశాడు. వాటిలో ఒకటి ఊర మాస్‌గా కనపించగా మరొకటి పక్కా క్లాస్‌గా కపించాడు. రెండింటిలోనే తనదైన నటన కనబరిచిన రామ్ ఈ సినిమాపై మంచి అంచనాలను పెట్టుకున్నాడు. ఈ సినిమా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో మాల్వికా శర్మా, అమ్రితా అయ్యర్లు హీరోయిన్లుగా చేశారు. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో టాలెంటెడ్ నటి నివేథా పేతురాజ్ కనిపించింది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈ వెంట్‌ను జరుపుతున్నారు. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్దం అయింది. ప్రేక్షకుల అంచనాలను తప్పకుండా అందుకుంటామని చిత్ర టీం ధీమా వ్యక్తం చేస్తోంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష