తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- January 13, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 331 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 394 మంది కరోనాబారినపడి పూర్తిగా కోలుకున్నారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 2,90,640కు చేరుకోగా.. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 1571కు పెరిగింది.. ఇక, 2,84,611 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,458 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. వాటిలో 2461 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. మరోవైపు.. మంగళవారం రోజు రాష్ట్రవ్యాప్తంగా 38,192 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 73,50,644కు చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక







