పేరు మార్చిన అమెజాన్..కారణం ఏంటి?
- January 13, 2021
ఆన్లైన్ షాపింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న అమేజాన్ సంస్థ అనంతరం అమేజాన్ ప్రైమ్ పేరుతో ఓటీటీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఓటీటీ రంగానికి సరికొత్త అర్థం చెబుతూ దూసుకొచ్చిన అమేజాన్ హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ చిత్రాలను, వెబ్ సిరీస్‌లను తెరకెక్కిస్తూ డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉంటే తాజాగా ‘అమేజాన్ ప్రైమ్ వీడియో’ పేరులో ఓ చిన్న మార్పు చేసింది. అమేజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) పేరులో ఉన్న ‘ME’అక్షరాలను తొలగించింది. సోషల్ మీడియా వేదికగా కూడా పేరు మార్చింది. ఇక ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలుపుతూ అమేజాన్ సంస్థ.. ‘ప్రై వీడియో’ అనే ఒక పోస్టు పెట్టి #WhereIsME అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేసింది.
ఇక అమేజాన్ ఎందుకిలా పేరు మార్చిందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అసలు ఎందుకు పేరు మార్చారు.. ఎందుకు ఈ రెండు అక్షరాలను తొలగించారు అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతటితో ఆగకుండా దీనిపై ఫన్నీ మీమ్స్ రూపొందిస్తూ నెట్టింట్లో పోస్ట్ చేస్తున్నారు. అమేజాన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనకాల ఉన్న కారణమేంటో తెలియాలంటే సంస్థ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాలి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!