'TWA' ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం...
- January 16, 2021
దోహా:తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ఖతార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొట్ట మొదటి రక్త దాన శిబిరం హమద్ మెడికల్ కార్పొరేషన్ & బ్లడ్ డోనార్ సెంటర్ వారి సహకారంతో 176 మంది దాతలతో ఏర్పాటు చేయటం జరిగింది.
ఈ రక్త దాన శిబిరం కి ముఖ్య అతిధులుగా బాబు రాజన్ ( ICC ప్రెసిడెంట్ ) , రజని మూర్తి ( ICBF MC మెంబర్), సత్యనారాయ మల్రెడ్డి ( ప్రెసిడెంట్ ఆంధ్ర కళా వేదిక), తిరుపతి (ప్రెసిడెంట్ TPS ), సబీనా (IT ప్రాజెక్ట్ మేనేజర్), శ్రీనివాస్ గద్దె (చైర్మన్ దానా వరల్డ్ కాంట్రాక్టింగ్), సయెద్ రఫీ (చైర్మన్ ఛానల్ 5 ) మరియు జావీద్ అహ్మద్ (ప్రెసిడెంట్ AMU ఖతార్) విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
TWA వారు రక్త దానం చేసిన వారందరికీ సర్టిఫికెట్స్ మరియు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లకు స్పాన్సర్లు సిటీ ఎక్స్చేంజి, డెక్కన్ హౌస్ మరియు కోనసీమ హైదరాబాద్ రెస్టారెంట్ వారికి ధన్యవాదాలు తెలిపారు.
TWA అధ్యక్షులు ఖాజా నిజాముద్దీన్ విచ్చేసిన వాలెంటీర్స్ మరియు రక్తదానం చేయడానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసారు. ఈ రక్త దాన శిబిరంకి TWA మ్యానేజ్మెంట్ కమిటీ, సబ్ కమిటీ, అడ్వైజరీ కమిటీ వారు పాల్గొనడం జరిగింది. ఈ క్యాంపైన్ విజయవంతం చేసిన వారు గులాం రస్సోల్, వెంకట సౌజన్య, నవీద్ దస్తగిరి, సుధాకర్ సోక్కం, నాగరాజు, రమేష్ పిట్ల, మహమ్మద్ సలావుద్దీన్, మహమ్మద్ తహ, శివ కృష్ణ, వేణు గోపాల్, స్వరాజ్ కుమార్, అనీష్ మహమ్మద్, ఆతిఫ్ మహమ్మద్, కృష్ణ ప్రసాద్, రాజు ఎర్రం, రమేష్ నేతాజీ, అమీర్ లూప్హఫ్ అహ్మద్, అర్షద్ అలీ, అస్ప్యాక్, అజీమ్ మరియు సంపత్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!