కోవిడ్ ఎఫెక్ట్...అబుధాబిలో ఎంట్రీకి కొత్త మార్గనిర్దేశకాలు జారీ
- January 17, 2021
అబుధాబి:ఇతర దేశాలతో పాటు దేశీయంగా కూడా అబుధాబిలోకి ఎంట్రీ అయ్యే ప్రయాణికుల కోసం కోత్త మార్గనిర్దేశకాలు జారీ చేసింది అబుధాబి క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఆదివారం(జనవరి 17) నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి ఎవరైనా అబుధాబికి ప్రయాణించాలంటే...ప్రయాణానికి ముందు 48 గంటల్లో కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అబుధాబి అధికారులకు పీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ లేదా డీపీఐ టెస్ట్ రిపోర్ట్ ఖచ్చితంగా చూపించాలి. అయితే..గతంలో ఈ గడువు 72 గంటలుగా ఉండేది. కానీ, అబుధాబి అధికారులు గడువును 48 గంటలకు కుదించారు. అలాగే అబుధాబిలో నాలుగు రోజులు ఉండే వారు...నాలుగో రోజున ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి...ఒకవేళ 8 రోజులు ఉంటే...ఎనిమిదవ రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందని వెల్లడించింది. అబుధాబిలోకి అడుగుపెట్టిన రోజును తొలి రోజుగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ నిబంధనలు యూఏఈలోని అన్ని ప్రాంతాల పౌరులు, ప్రవాసీయులకు వర్తిస్తుంది. అలాగే అబుధాబిలో ఉండే వారు ఇతర ప్రాంతాల నుంచి తిరిగి వచ్చినా..నిబంధనల నుంచి మినహాయింపు ఉండదనే విషయం గుర్తుంచుకోవాలని అధికారులు సూచించారు. అయితే..వాక్సినేషన్ లో పాల్గొన్నవారు..వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వాలంటీర్లకు మాత్రం ఈ కొత్త నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







