ఈ నెల 20న అమెరికా ప్రెసిడెంట్,వైస్ ప్రెసిడెంట్ల ప్రమాణ స్వీకారం
- January 16, 2021
అమెరికా:అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా జో బైడెన్, కమలాహారీస్‌లు ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరు కానున్నారు. కాగా, ఈ కార్యక్రమాల్లో ప్రఖ్యాత కళాకారులు పాల్గనున్నారు.
ప్రముఖ గాయని లేడీ గాగా జాతీయ గీతం ఆలపించనుండగా..నటి జెన్నిఫర్ లోఫెజ్ సంగీత కచేరీ కూడా ఉండనున్నట్లు సమాచారం. అయితే కరోనా నిబంధనల నేపథ్యంలో ఇవన్నీ కూడా వర్చువల్ విధానంలో నిర్వహిస్తారని తెలుస్తోంది. కాగా, జో బైడెన్, కమలాహారీస్ బృందంలో భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులు లభించాయి.
కరోనా కట్టడి చేసేందుకు టీకాలు అందించేందుకు సిద్ధమైన బృందంలో భారత సంతతి వ్యక్తికి చోటు కల్పించారు.
కోవిడ్ రెస్పాన్స్ టీమ్‌లో టెస్టింగ్ అడ్వైజర్‌గా హెల్త్ పాలసీ నిపుణుడు విదుర్ శర్మను బైడెన్ నియమించారు. సైనిక కుటుంబాల కోసం ఉద్దేశించిన 'జాయినింగ్ ఫోర్సెస్' కార్యక్రమ కార్యనిర్వాహక అధికారిగా... జో సీనియర్ సలహాదారు రోరీ బ్రోసియస్ పేరును ప్రకటించారు.
ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఫెమా) అడ్మినిస్ట్రేటర్‌గా న్యూయార్క్ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ కమిషనర్ డియన్నె క్రిస్‌వెల్‌ను నామినేట్ చేశారు. తదుపరి ప్రథమ మహిళ డిజిటల్ విభాగ డైరెక్టర్‌గా భారత సంతతి అమెరికన్ గరిమా వర్మ, మీడియా కార్యదర్శిగా మైఖేల్ లారోసా పేర్లను నామినేట్ చేశారు.
అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్-హారిస్ ప్రచార కార్యక్రమాలకు గరిమా జన సమీకరణ వ్యూహాలు రచించారు. బైడెన్ కార్యనిర్వాహక వర్గంలో ప్రధానమైన 'నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్' డిప్యూటీ డైరెక్టరుగా కశ్మీర్ మహిళ సమీరా ఫాజిల్‌ను బైడెన్ ఎంపిక చేశారు.దేశంలో తయారీ, ఆవిష్కరణలు వంటి అంశాలను ఆమె పర్యవేక్షిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







