దోహాలో త్వరలోనే ఎంబసీ కార్యాలయం పునరుద్ధరణ...సౌదీ ప్రకటన

- January 17, 2021 , by Maagulf
దోహాలో త్వరలోనే ఎంబసీ కార్యాలయం పునరుద్ధరణ...సౌదీ ప్రకటన

రియాద్:దోహాలో త్వరలోనే రాయబార కార్యాలయాన్ని రీఓపెన్ చేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. అవసరమైన చర్యలు పూర్తి అయిన వెంటనే కార్యాలయ కార్యకలాపాలు ప్రారంభిస్తామని సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ వెల్లడించారు. అల్ ఉలా ఒప్పందం తర్వాత తీసుకుంటున్న సానుకూల నిర్ణయాల్లో భాగంగా రాయబార కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఖతార్ తో  జోర్డాన్ విదేశాంగ మంత్రి అయ్మాన్ సఫాది తో కలిసి ఆయన రియాద్ ఈ ప్రకటన చేశారు. పాలస్తీనా వివాదానికి సమగ్ర పరిష్కారం పొందాల్సిన అవసరాన్ని సౌదీ మంత్రి పునరుద్ఘాటించారు. ఇదిలాఉంటే..జోర్డాన్ మంత్రి మాట్లాడుతూ...సౌదీతో మైత్రి చారిత్రాత్మకమైనది అభివర్ణించారు. ఆర్ధిక సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ మైత్రి దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే సౌదీపై హౌతి మిలిషియా దాడి ప్రయత్నాలను సఫాది ఖండించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com