'రోబరి' సినిమా ట్రైలర్ విడుదల
- January 17, 2021
హైదరాబాద్:సుదర్శన్ మూవీ మేకర్స్ పతాకంపై యస్.యన్. నాయుడు, యస్.ఏ.నరసమ్మ సమర్పణలో యస్.శ్రీనివాస్ దర్శక నిర్మాతగా, యస్.సుధీర్ సహనిర్మాతగా అభిషిక్త్, సమ్మోహన హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'రోబరి'. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో జరిగింది. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ' ట్రైలర్ బాగుంది. ఈ చిత్రం విజయం సాధించి దర్శక నిర్మాతలకు, హీరో హీరోయిన్ కు మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను' అన్నారు. మరో అతిథి ఏ.పి.ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ ' ఎన్నో సంవత్సరాలుగా సినిమాను నమ్ముకొని వున్న వ్యక్తి శ్రీనివాస్ అని, ఈ సినిమా విజయంతో అతని చిరకాల కోరిక నెరవేరి మరెన్నో చిత్రాలను నిర్మించాలని కోరారు.
దర్శక నిర్మాత యస్.శ్రీనివాస్ మాట్లాడుతూ 'నా అభిమాన హీరో శ్రీకాంత్ చేతులమీదుగా నా రోబరి సినిమా ట్రైలర్ లాంచ్ జరగడం నా అదృష్టమని, ఈ అవకాశాన్ని నాకు కల్పించిన శ్రీమిత్ర చౌదరి , మోహన్ గౌడ్ నేను ఋణపడి వుంటానని, శ్రీకాంత్ ది లక్కీ హ్యాండని, ఆ లక్కీ మాకు కూడా కలిసివస్తుందని ఆశిస్తున్నామని' తెలిపారు. హీరో అభిషిక్త్ మాట్లాడుతూ' ఈ సినిమా నాకు హీరోగా మంచి పేరు తెచ్చి పెడుతుందని, దర్శక నిర్మాత శ్రీనివాస్ గారు ఎక్కడా రాజీ పడకుండా మాతో నటింపజేశాడని' తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీమిత్ర చౌదరి, నారాయణరావు, పెరుగు వెంకటేష్, మిత్తాని ఈశ్వర్, రాయిపాటి నాగేశ్వర్, దొరబాబు, మణికంఠ పాల్గోన్నారు. యస్.శ్రీనివాస్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్, ఫైట్స్: మల్లేశ్ - దేవరాజ్, డైలాగ్స్: నండూరి వీరేశ్, కెమెరా: యాదగిరి, ఎడిటింగ్: అనిల్ కుమార్.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







