ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు..
- January 18, 2021
కరోనా వైరస్ మొత్తం ప్రపంచ దేశాలన్నింటిని చుట్టేసింది. ఏడాది గడుస్తున్నా కూడా.. ప్రతీ రోజూ నమోదయ్యే పాజిటివ్ కేసులు, మరణాలకు మాత్రం బ్రేక్ పడట్లేదు. ఇదిలా ఉంటే మరోవైపు యూకేలో పుట్టిన కొత్తరకం వైరస్ ప్రజలను మరింత భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇది కరోనా కన్నా 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించడంతో దేశాలన్నీ కూడా మరోసారి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. ఇక తాజాగా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 95,494,986కి చేరింది. గడిచిన 24 గంటల్లో 5,32,236 పాజిటివ్ కేసులు, 9,192 మరణాలు సంభవించాయి. అటు ఇప్పటిదాకా 2,039,986 మంది వైరస్ కారణంగా మరణించగా.. 68,211,614 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ప్రతీ రోజూ భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 24,482,050కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 407,202 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, యూఏఈ,యూకేలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బ్రిటన్, ఆఫ్రికా దేశాల్లో కొత్తరకం ‘స్ట్రెయిన్’ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచమంతా ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇండియాలో ఇప్పటివరకు 10,572,672 పాజిటివ్ కేసుల కేసులు నమోదు కాగా.. 152,456 మంది వైరస్ కారణంగా మరణించారు.
తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







