‘గెట్ టుగెదర్’ చేసుకున్న హాస్యనటులు..
- January 18, 2021
హైదరాబాద్:తెలుగు సినిమాల్లోని యంగ్ కమెడియన్స్ అంతా ఒకే ఫ్రేమ్లో కనిపించారు. సినిమాల్లో వీరందరూ ఓకే సారి కనిపించారు. కానీ ఈసారి మాత్రం అంతా కలిసి గెట్ టుగెదర్ జరుపుకున్నారు. ఇందులో మొత్తం 11 మంది కమెడియన్లు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
గెట్ టుగెదర్ ఫోటోలను స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. “దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఫ్లయింగ్ కలర్స్ రీయూనియన్.. ఈ ఫోటో షేర్ చేయడానికి రెండు వారాలు పట్టింది”.. అంటూ రాసుకొచ్చాడు వెన్నెల కిషోర్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇది చూసిన నెటిజన్లు రకారకాలు గా కామెంట్స్ చేస్తున్నారు. కమెడియన్లంతా ఒకే చోట చేరడం బాగుంది.. ఈ పదకొండు మంది కలిసి పరమానందయ్య శిష్యుల కథ సినిమాను మళ్ళీ తీస్తే చాలా బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







