వ్యాక్సిన్ తర్వాత వెయిటింగ్ సమయాన్ని రద్దు చేసిన యూఏఈ

వ్యాక్సిన్ తర్వాత వెయిటింగ్ సమయాన్ని రద్దు చేసిన యూఏఈ

యూఏఈ నేషనల్ కోవిడ్ 19 క్లినికల్ మేనేజ్‌మెంట్ కమిటీ, కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వేచి వుండాల్సిన సమయాన్ని తగ్గించింది. గతంలో వ్యాక్సిన్ తీసుకున్నవారు, ఆ తర్వాత కొంత సమయం పాటు వేచి వుండాల్సి వచ్చేది.. తద్వారా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయేమోనని గుర్తించడానికి వీలయ్యేది. అయితే, అలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం దాదాపు లేదని వ్యాక్సినేషన్ ప్రకియ వేగవంతమయ్యాక తేలడంతో, ఆ సమయాన్ని రద్దు చేయడం జరిగింది. వ్యాక్సిన్ వేయించుకున్న వెంటనే ఆయా వ్యక్తులు వ్యాక్సిన్ కేంద్రం నుంచి వెళ్ళిపోవచ్చు ఇకపై. కాగా, డాక్టర్ అల్ కాబి మాట్లాడుతూ, సినోఫామ్ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనదనీ, కోవిడ్ 19 కొత్త స్ట్రెయిన్‌పైన కూడా పనిచేస్తుందని అన్నారు.

Back to Top