ఇది నీ యుగం

- February 23, 2016 , by Maagulf

అమ్మా! ఇక  మావల్ల కాదమ్మా,

మాకు లేదమ్మా ఆపే శక్తి, నిన్ను ఆకలి చూపులతో చూసే

గుంట నక్కలు ఉధృతంగా పెరుగుతున్నఈ లోకాన్ని  

 

ప్రేమ పేరుతో పిచ్చి చేష్టల విద్యలు ప్రయోగించేసి,

నిన్నూ  నీలోని మనసును భయ విహ్యలను చేసి 

నీ స్వేచ్చను హరించే, 

 

ఆకతాయిల అడుగులను,అడుగడుగునా అడ్డుకొనే యుక్తీ,  

 

కాసుల కోసం ఒంటరి మహిళల కుత్తుక కోసెళ్లి పోయే 

నర రూప రాక్షస మూకల్ని ఆపే దమ్ము, 

 

నీ అంగాంగాల్ని తమ లింగ దృష్టితో చూసి 

నిన్ను కామం దీర్చే పని ముట్టుగా 

చేసే మానవ మృగాల్ని కనిపెట్టడం 

మనిషి విలువలు మంట గలిసిన,

ఈ భాదిత భారతం వల్ల ఇక కాదమ్మా,, 

 

ఇక నువ్వు తల్లిగా, చెల్లిగా అక్కగా ఒక ఆలిగా, 

చివరకు వారికి చిగురించిన ఓ చిన్నారిగా నైతే నేమి,

 

నువ్వు ఏ మృగతృష్ణలో చిక్కుకొని  

ఏ మనో వ్యధలో క్రుంగి పోతూ ఏ రూపంలో

ఎచట ఏ కీచకుడికి సమిధగా మారుతున్నవో కాని ..

 

నువ్విప్పుడొక ఏకమైన శక్తివై ...ఆది పరా శక్తివై నీకు నువ్వే 

పహారా కాచు కోవాల్సిన సంధర్భం ఆసన్నమయిందిక  

 

నిన్ను నీ జాతిని హింసించి మిమ్ము మానసిక 

వేదన పెట్టే వారిపై బలవంతంగా నైనా కసిపెంచుకొనే 

కాలం మొలిచిందిక   ..  

 

నిన్ను నీలాంటి అవయవాలతో ఆడుకొని  కాట్లు బెట్టి 

నిన్ను ఒంటరి జేసి కాటేసిన ఆ రాక్షస వారసులను 

జుట్టు పట్టి ఈడ్చాలిక  .. 

 

నిన్ను  కామాగ్నితో  కాంక్షించిన వారిని మట్టు బెట్టీ 

నీకు చింత లేని నిర్భయమైన స్వేచ్చా బ్రతుకునిచ్చే  

స్వచ్చమైన కాలం రావాలిక,

 

నీ నిర్భయ విషాద భారతం మళ్లీ మళ్లీ కన్నీరోడ్చకుండా  

వాని నీడ చూసి వాడే గజ గజ వనికేలా చేసే  

ఆత్మస్థైర్యం నీలో కలగాలిక 

 

నిన్ను నువ్వు (మిమ్ము మీరు) కాపాడుకొనే 

యుగం మీది కావాలిక  ,,

 

--జయ రెడ్డి బోడ(అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com