మోటార్ వాహనాల మార్గాలలో పెరిగిన కనీస వేగ పరిమితి
- February 23, 2016
యు.ఎ.ఇ. లో, ట్రాఫిక్ రద్దీని అధిగమించేందుకు మోటార్ వాహనాలకు కేటాయించిన దారులలో కనీస వేగాన్ని
పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. ఇటీవల ఫెడరల్ ట్రాఫిక్ కౌన్సిల్ జరిపిన సమావేశంలో ఈ
పెంపుదలను ఆమోదించారు. రహదారి అంచులో కనిష్ట మరియు గరిష్ట వేగ పరిమితుల మధ్య భారీ వత్యాసం ఉన్నట్లు వారు కనుగొన్నారు, మండలి అధ్యక్షుడు, అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ దుబాయ్ పోలీస్ మేజర్ జనెరల్ మొహమ్మద్ అల్ జాఫిన్ ' ఏమరాట్ అల్ యొఉమ్ ' దినపత్రిక కు తెలిపారు. పైన పేర్కొన్న నిర్ణయానికి ప్రభావితం కాబోయే షేక్ జాయెద్ రోడ్ లో, కనీస వేగ పరిమితి ప్రస్తుతం గంటకు 60 కిలోమీటర్లు ఉందని, ఇది ఈ మార్గంలో చాల తక్కువ వేగమని పేర్కొంటూ, కనిష్ట మరియు గరిష్ట వేగ పరిమితుల మధ్య మార్జిన్ గతంలో గంటకు 20 కిలోమీటర్ల వేగం మించకూదదనే నిబంధన ఉండేదని చెప్పారు. కాగా ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం షేక్ జాయెద్ రోడ్ పై వాహనాల కనీస వేగ పరిమితి గంటకు 100 కిలోమీటర్లు ఉండాలి. అత్యధిక శాతం మంది డ్రైవర్ లు గంటకు 60 కిలోమీటర్లు వెళ్ళాల్సిన రోడ్లపై గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారని , దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీకు కారణమవుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







