వ్యాక్సినేషన్ తేదీలను రీషెడ్యూల్ చేయనున్న కువైట్
- January 21, 2021_1611250404.jpg)
కువైట్ సిటీ:కువైట్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ కు అడ్డంకులు ఎదురవుతున్నాయి. సరిపోయినంతగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో లేకపోవటంతో వైరస్ వ్యాక్సిన్ అపాయింట్మెంట్ తేదీలను రీషెడ్యూల్ చేయనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నిజానికి ఫైజర్-బయోన్టెక్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు తొలి విడత డోసులకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది కువైట్. అయితే..ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి ఫైజర్ కంపెనీకి కుప్పలు తెప్పలుగా ఆర్డర్లు రావటం...డిమాండ్ కు తగినట్లు ప్లాంట్ లో ఉత్పత్తి లేకపోవటంతో ఒప్పందం మేరకు అందివాల్సిన డోసులు ఇంకా కువైట్ కు చేరుకోలేదు. త్వరలోనే సెకండ్ బ్యాచ్ వస్తుందని కువైట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఫైజర్ నుంచి తమకు ఉన్న సమాచారం మేరకు వైరస్ వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్లను రీషెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించింది కువైట్.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!