దుబాయ్ డైలీ రెండు ఫ్లైట్ సర్వీసులను ప్రారంభించిన ఖతార్
- January 21, 2021
జీసీసీ సభ్య దేశాలతో ఉన్న పొరపొచ్చాలు సమిసిపోవటంతో ఆయా దేశాలకు రవాణా ఆంక్షలు కూడా తొలిగిపోయాయి. జల, రోడ్డు, రవాణాతో పాటు విమాన సర్వీసులను కూడా పలు దేశాలకు పునరుద్ధరిస్తోంది ఖతార్. ఇందులో భాగంగా యూఏఈ రాజధాని అబుధాబితో పాటు దుబాయ్ కి కూడా ఫ్లైట్ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. జనవరి 27న దుబాయ్ కి తొలి ఫ్లైట్ బయల్దేరనుంది. అలాగే జనవరి 28న అబుధాబికి ఖతార్ నుంచి తొలి విమానం చేరుకుంటుంది. ప్రతి రోజు దుబాయ్ రెండు విమానాలు, అబుధాబికి ఒక విమాన సర్వీసును స్టార్ట్ చేస్తున్నట్లు ఖతార్ వెళ్లడించింది. ఇదిలాఉంటే..ఖతార్ తో జీసీసీ సభ్యదేశాలు ఎయిర్ స్పేస్ ను ఒపెన్ చేయటంతో ఇప్పటికే ఎయిర్ అరేబియా, ఎతిహాద్ ఎయిర్ వేస్, బడ్జెట్ ఎయిర్లైన్స్ ఫ్లై దుబాయ్ కూడా విమాన సర్వీసులు ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!