'లక్ష్య' టీజర్ విడుదల
- January 22, 2021
హైదరాబాద్:నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్య’. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా ఆర్చరీ నేపథ్యంలో తెరెకెక్కుతుంది ఈ సినిమా. అందుకోసం తన శరీరాన్ని మరింత దృఢంగా మార్చుకున్నాడు. సూపర్ ఫిట్ బాడీతో, సిక్స్ ప్యాక్‌తో ఉన్న నాగశౌర్య ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. నాగశౌర్య బర్త్‌డే సందర్భంగా ఈ టీజర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ టీజర్లో నాగశౌర్య తన సిక్స్ ప్యాక్‌తో హల్ చల్ చేశాడు. ఈ టీజర్‌తో లక్ష్య సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







