డిస్కౌంట్ ఫేర్స్‌కి నేడే ఆఖరి రోజు
- February 23, 2016
ప్రముఖ ఎయిర్‌లైన్స్ కంపెనీలు ఎమిరేట్స్, ఎయిర్ అరేబియా, ఖతార్ ఎయిర్‌వేస్ డిస్కౌంట్స్‌తో కూడిన ఎయిర్ ఫేర్స్‌ని అందుబాటులోకి తెచ్చాయి. ఈ ఆఫర్లు ఈ నెలతో ముగియనున్నాయి. షార్జా బేస్డ్ ఎయిర్ అరేబియా, 48 గంటల లిమిటెడ్ టైమ్ ఆఫర్‌ని ప్రకటించింది. ఎంపిక చేసిన 18 ప్రాంతాలకు 270 దిర్హామ్‌ల నుంచి (అన్నీ కలుపుకుని) ఫేర్స్‌ని ప్రకటించింది. అన్ని ఆఫర్స్ 1000 దిర్హామ్‌ల లోపే ఉండడం గమనించదగ్గది. నేడే బుక్ చేసుకున్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఏప్రిల్ 30 లోపల ఈ ప్రయాణాల్ని చెయ్యాలి. ఇండియన్ సబ్ కాంటినెంట్ డెస్టినేషన్స్ ఇందులో పొందుపర్చలేదు. షార్జా నుంచి డమ్మమ్ కేవలం 629 దిర్హామ్‌లకు, బీరట్‌కి 799 దిర్హామ్‌లకు, ఇస్తాంబుల్ అమ్మాన్‌లకు 899 దిర్హామ్‌లకు ప్రయాణించేలా ఆఫర్స్ ఉన్నాయి. ఖతార్ ఎయిర్ వేస్, యూఎస్‌కు వెళ్ళేందుకు ఆఫర్లను ప్రకటించింది. అబుదాబీ నుంచి న్యూయార్క్‌కి 3075 దిర్హామ్‌లు, వాషింగ్టన్‌కి 3585 దిర్హామ్‌లు చెల్లించాలి. ఇది ఎకానమీ క్లాస్ ధరలు. నేడే వీటికీ టిక్కెట్లను బక్ చేసుకోవచ్చు. ప్రయాణకాలం జూన్ 15 వరకు ఉంటుంది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ ఫిబ్రవరి 28 వరకు ఆఫర్ ధరలో టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అయితే మార్చ్ 13 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆఫర్ ప్రయాణ కాలాన్ని చూపిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







