డ్రైవింగ్ లైసెన్స్ రుసుముపై మహిళల ఫిర్యాదు
- February 23, 2016
రస్ అల్ ఖైమాలోని పలువురు మహిళలు, డ్రైవింగ్ స్కూల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం రుసుమును పెంచినట్లుగా ఫిర్యాదు చేశారు. ఈ పెంపు 50 శాతం వరకూ ఉంది. అలాగే డ్రైవింగ్‌లో స్కిల్స్ పెంచుకోవడానికి తగిన సమయం కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. పెంచిన ఫీజులు తగ్గించాలనీ, అలాగే నాణ్యతతో కూడిన లెర్నింగ్ ఉండేలా డ్రైవింగ్ స్కూల్స్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో మహిళలు పేర్కొన్నారు. ఈజిప్ట్‌కి చెందిన ఉమ్ అబ్దుల్లా మాట్లాడుతూ, డ్రైవింగ్ లైసెన్స్ కోసం చాలా ఖర్చు చేశాననీ, లెసన్స్ విషయంలో కూడా తనకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. అన్క్వాలిఫైడ్ డ్రైవింగ్ టీచర్స్‌తో డ్రైవింగ్ స్కూల్స్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారామె. గతంలో 25 దిర్హామ్‌లు చెల్లించేవారమనీ, ఇప్పుడు అదే గంట క్లాస్ కోసం 50 దిర్హామ్‌లు చెల్లించవలసి వచ్చిందని సిరియా వలసదారు అయిన ఉమ్ మహమ్మద్ చెప్పారు. పెద్ద సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులతో సంబంధిత వర్గాలు స్పందించి, డ్రైవింగ్ స్కూల్స్‌లో ఇన్స్పెక్షన్ ప్రారంభించారు. అనుభవజ్ఞులైనవారితోనే డ్రైవింగ్ పాఠాలు చెప్పించాలనీ, నీట్నెస్ అలాగే, డ్రెస్ కోడ్ విషయంలోనూ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని అధికారులు చెప్పారు. సంబంధిత శాఖ, ఫీజుల్ని పెంచుకోవడానికి ఆస్కాంర కల్పించినప్పటికీ, తగిన సౌకర్యాలు కల్పించని పక్షంలో చర్యలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







