కోవిడ్ రూల్స్ బ్రేక్..ఔట్ లెట్స్, మేనేజర్లకు BD15,000 ఫైన్
- January 24, 2021
మనామా:కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన ఔట్ లెట్లు, ఓట్ లెట్ల నిర్వాహకులకు ఒక్కొక్కరికి 1000 నుంచి 2000 బహ్రెయిన్ దినార్లు...లేదంటే మొత్తం 15,000 బహ్రెయిన్ దినార్లు చెల్లించాలని జరిమానా విధించింది బహ్రెయిన్ దిగువ క్రిమినల్ కోర్టు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం సూచించిన నిబంధనలు ఉల్లంఘించటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. కోవిడ్ రూల్స్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు ఎప్పటికప్పుడు క్షేత్ర పర్యవేక్షిస్తున్న ప్రజా ఆరోగ్య అధికార బృందాలు..మూడు రెస్టారెంట్లు, ఓ కేఫ్, సూపర్ మార్కెట్లలో తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించాయని పబ్లిక్ హెల్త్ అథారిటీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. భౌతిక దూరం పాటించకపోటం, టేబుళ్ల మధ్య రెండు మీటర్ల దూరాన్ని పాటించకపోవటం, ఒక్కో టేబుల్ పై ప్రభుత్వం నిర్దేశించిన 50శాతం సీటింగ్ కంటే ఎక్కువ మందికి అనుమతి ఇవ్వటంతో పాటు ఔట్ లెట్స్ లో సామర్ధ్యానికి అనుగుణంగా నిర్ణీత సంఖ్యకు మించి ఎక్కువ మందికి అనుమతి ఇవ్వటం, ఎంట్రీ దగ్గర టెంపరేచర్ చెక్ చేయటంలో విఫలం అవటం వంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు తమ నివేదికలో పేర్కొంది. రూల్ బ్రేక్ చేసి వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలకు విఘాతం కలిగేలా వ్యవహరించిన ఔట్ లెట్స్ ను సీజ్ చేసినట్లు వివరించింది. కేసును విచారణను చేపట్టిన దిగువ క్రిమినల్ కోర్టు..ఔట్ లెట్స్, ఔట్ లెట్స్ నిర్వాహకులకు కలిపి 15,000 దినార్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!
- ఇరాన్ తీరుపై యూఏఈ ఫైర్.. ఉద్రిక్తతలు తగ్గించే ఆలోచన లేదా?







