కువైట్: అక్రమంగా మెడిసిన్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
- January 24, 2021
కువైట్ సిటీ:ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మెడిసిన్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. సల్మియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మెడిసిన్ అమ్మాలంటే ఫార్మసీ విద్యార్హతతో పాటు షాపు నిర్వహణకు తగిన అనుమతులు తప్పనిసరి. అయితే..అవేం లేకుండా ఫుట్ పాత్ వ్యాపారంలా బాటసారులకు ఎవో మెడిసిన్ అమ్ముతున్నట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే స్పాట్ కు చేరుకొని మెడిసిన్ అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. 'లిరికా', 'నిర్ఫాక్స్' మందులను అమ్ముతున్నట్లు గుర్తించామని వెల్లడించారు. పట్టుబడిన మొదటి నిందితుడ్ని విచారించటంతో మరో వ్యక్తి కూడా తనకు భాగస్వామిగా ఉన్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడని, దీంతో అతన్ని కూడా అరెస్ట్ చేశామని పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







