ఒమన్ లో ఇప్పటివరకు 27 వేల మందికి కోవిడ్ వ్యాక్సిన్
- January 24, 2021
మస్కట్:ఒమన్ లో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కింగ్డమ్ పరిధిలో పౌరులు, ప్రవాసీయులు అందరికీ వ్యాక్సిన్ అందిస్తామని మరోసారి తెలిపింది. కోవిడ్ 19 వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రజలు రోగ నిరోధక శక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ఇమ్యూనిటీని పెంచేందుకు వ్యాక్సిన్ దోహదపడుతుందని ఆరోగ్య శాఖ అధికారుల అన్నారు.. కోవిడ్ 19పై ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ 99 శాతం ప్రభావశీలతతో ఫలితాన్నిస్తున్న విషయాన్ని అందరూ పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. గతేడాది డిసెంబర్ 28న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేపట్టగా...ఇప్పటివరకు 27 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఒమన్ ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







