60 వేల టికెట్ల రద్దు..కువైట్ నిర్ణయంతో విమాన ప్రయాణికులకు తప్పని తిప్పలు

- January 24, 2021 , by Maagulf
60 వేల టికెట్ల రద్దు..కువైట్ నిర్ణయంతో విమాన ప్రయాణికులకు తప్పని తిప్పలు

కువైట్ సిటీ:కువైట్ వచ్చే విమానాల్లో ప్రయాణికుల సంఖ్యను కుదిస్తూ కువైట్ డీజీసీఏ తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఒక్క రోజుకు వెయ్యి మంది ప్రయాణికులను మాత్రమే అనుమతించాలని కువైట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అంటే ఒక్కో ఫ్లైట్ లో 35 ప్రయాణికులకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. దీంతో కువైట్ వెళ్లే అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లను కూడా ఆయా విమానయాన సంస్థలు రద్దు చేస్తున్నాయి. అందుకు బదులుగా ప్రయాణ సమయాన్ని రీ షెడ్యూల్ చేసుకోవాలని కోరుతున్నాయి. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 6 వరకు ప్రయాణికుల సంఖ్యపై పరిమితిపై ఆంక్షలు ఉండనున్నాయి. దీంతో ఈ రెండు వారాలకుగాను దాదాపు 60 వేల టికెట్లను రద్దు చయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇందులో చాలా మంది ప్రయాణికులకు ఇప్పిటికే టికెట్ రద్దుకు సంబంధించి సమాచారాన్ని కూడా అందిస్తున్నాయి విమానయాన సంస్థలు. ఇటీవలె బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కోవిడ్ ఉత్పరివర్తన వైరస్ కనిపించటంతో పాటు..వైరస్ మ్యూటేషన్ ముప్పుతో ప్రయాణికుల సంఖ్యను కుదించింది కువైట్. విమానాశ్రయాల్లో ప్రైవేట్ లాబరేటరీ సేవలు ప్రారంభమైన తర్వాతే ప్రయాణికుల సంఖ్యపై పునరాలోచిస్తామని కువైట్ డీజీసీఏ స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com