పవన్ కళ్యాణ్-రానా మూవీ షూటింగ్ ప్రారంభం
- January 25, 2021
హైదరాబాద్:మలయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ ను తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి హీరో రానా కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందిస్తుండటంతో పాటుగా, పర్వవేక్షణ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ నేడు హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. ఈ భారీ సెట్ లోనే సినిమా దాదాపుగా నెల రోజులు పాటు షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. ఇక ఈ సినిమాకు హీరోయిన్లుగా చాలా మంది పేర్లు వినిపిస్తున్న ఇంతవరకు చిత్రయూనిట్ అధికారికంగా ఎవరి పేర్లను అనౌన్స్ చేయలేదు. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకి తెలుగులో ‘బిల్లా-రంగా’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష