షిఖా అమీనా బింట్ సౌద్ బహ్వాన్ దాతృత్వం..

షిఖా అమీనా బింట్ సౌద్ బహ్వాన్ దాతృత్వం..

మస్కట్:గల్ఫ్ లో ఓ ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన షిఖా అమీనా బింట్ సౌద్ బహ్వాన్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఒమన్ లోని దక్షిణ షార్కియాలోని జలాన్ బని బు హసన్ ఆసుపత్రిని విస్తరించడానికి బహ్వాన్ RO500,929 విరాళం ఇచ్చారు. ఈ నిధులతో ఆస్పత్రిలో అత్యవసర విభాగాన్ని మరింతగా విస్తరించనున్నట్లు ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ కార్యాలయం వెల్లడించింది. ప్రజలకు వైద్య సేవలను మెరుగు పరిచేలా ఆస్పత్రి విస్తరణకు  RO500,929 విరాళం ఇచ్చిన బహ్వాన్ ను ఆరోగ్యశాఖ ధన్యవాదాలు తెలిపింది. ఆమె దాతృత్వాన్ని ప్రశంసిస్తూ ప్రకటన విడుదల చేసింది. 

 

Back to Top