కమర్షియల్ ఫ్లైట్స్ పై ఆంక్షల కొనసాగింపు..కువైట్ మంత్రివర్గం ప్రకటన

కమర్షియల్ ఫ్లైట్స్ పై ఆంక్షల కొనసాగింపు..కువైట్ మంత్రివర్గం ప్రకటన

కువైట్ సిటీ:దేశంలో కరోనా ప్రభావం కొనసాగుతుండటంతో కమర్షియల్ ఫ్లైట్స్ పై ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని కువైట్ మంత్రివర్గం నిర్ణయించింది. వైరస్ తీవ్రత..చేపట్టాల్సిన చర్యలపై ప్రతి వారం సమీక్షిస్తున్న మంత్రిమండలి...ఈ వారం కూడా సమావేశమై ప్రస్తుత పరిస్థితులను రివ్యూ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతూనే ఉందని అభిప్రాయపడింది. ఇప్పటివరకు దాదాపు 100 మిలియన్ల మంది వైరస్ బారిన పడ్డారని, అలాగే వైరస్ ఉత్పరివర్తనాలు(స్ట్రెయిన్) దాదాపు రెండు మిలియన్ల మందికి వ్యాపించాయని వెల్లడించింది. వైరస్ వ్యాప్తి సమర్ధవంతంగా నియంత్రించేందుకు ఇంకొన్నాళ్లు ప్రస్తుత విధానాలనే కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రజలందరికీ ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు వివరించిన మంత్రివర్గం...దేశంలోని పౌరులు, ప్రవాసీయులు కూడా తమ వంతు బాధ్యతగా తగిన జాగ్రత్తలు పాటించటంలో సీరియస్ గా ఉండాలని సూచించింది. ఇక విమాన సర్వీసులకు సంబంధించి ఇప్పటికే తొలి విడతగా నిర్ణీత సంఖ్యలో కమర్షియల్ ఫ్లైట్లకు అనుమతి ఇచ్చిన కువైట్...రెండో దశలో భాగంగా మరిన్ని కమర్షియల్ ఫ్లైట్ల పునరుద్ధరణను మాత్రం వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రెండో దశ పునరుద్ధరణ ఉండదని ప్రకటించింది.

 

Back to Top