న్యూ ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

- January 26, 2021 , by Maagulf
న్యూ ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

న్యూ ఢిల్లీ:72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో గణతంత్ర వేడుకల్ని కొంతవరకు తగ్గించారు.ఈ ఏడాది ముఖ్య అతిథి ఎవరూ లేకుండానే రిపబ్లిక్ వేడుకల్ని నిర్వహించారు. రాజ్‌పథ్‌లో.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ జాతీయ జెండాను ఉదయం 10 గంటలకు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత.. హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. రాష్ట్రపతికి 21 గన్స్‌ ఫైరింగ్‌తో సైనికులు వందనం సమర్పించారు.

 

అంతకు ముందు.. వార్ మెమోరియల్‌ వద్ద అమరజవాన్లకు ప్రధాని, త్రివిధ దళాల అధిపతులు నివాళులు అర్పించారు.సైనికుల సేవల్ని ప్రధాని మోదీ స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మోదీతోపాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ కూడా పాల్గొన్నారు. అక్కడి నుంచి ప్రధాని మోదీ రాజ్‌పథ్‌కు వెళ్లారు.కరోనా పరిస్థితుల్లో.. 15 ఏళ్లకంటే చిన్నవారిని గణతంత్ర వేడుకల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించారు. అటు ప్రేక్షుకుల గాలరీలోనూ.. భౌతికదూరం ఉండేలా కుర్చీలు ఏర్పాటు చేశారు. జాతీయ జెండాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఆవిష్కరించాక... సైనిక దళాల ప్రత్యేక గౌరవవందనం స్వీకరించారు. ఆ తర్వాత టీ 90 యుద్ధ ట్యాంకుల ప్రదర్శనతో పరేడ్ ప్రారంభమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com