టీ20 ఆసీయా కప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
- February 24, 2016
టీ20 ఆసీయా కప్ మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 45 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 166/6 పరుగులు చేసింది. భారత్ జట్టులో రోహిత్‌శర్మ 55 బంతుల్లో 83 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఆట చివరిలో హార్దిక్ పాండ్య మెరుపు ఇన్నింగ్స్‌తో 18 బంతుల్లో 31 పరుగులు చేశాడు. 167 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో బంగ్లాదేశ్ ఆరంభంలోనే తడబడి రెండు ప్రధాన వికెట్లను కోల్పోయింది. దీంతో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. బంగ్లా జట్టులో షబ్బీర్ రహమాన్ 32 బంతుల్లో 44 పరుగులు మినహ జట్టులో ఎవరు చెప్పుకోతగ్గ పరుగులు చేయలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ 127/7 పరుగులు చేసి 45 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







