ఉల్లిపాయలో వుండే ఆరోగ్య లక్షణాలు ..
- February 24, 2016
ఉల్లిపాయ చేసిన మేలు తల్లి కూడా చేయదన్న సామెత మనందరికి తెలిసిన విషయమే. మనకు తెలిసో తెలియకో ప్రతి రోజు ఆహారంలో ఉల్లిపాయను తీసుకుంటాం. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. మనం జబ్బు పడినప్పుడు లేదా త్వరగా నయం కావటానికి ఉల్లిపాయ మంచి మందుగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. దీనిని దాదాపుగా అన్ని వంటల్లోనూ వాడటం వల్ల అందులో ఉండే అనేక రసాయనాలు అనారోగ్యం బారిన పడకుండా చేస్తాయి.
మరి మన శరీరానికి ఎలాంటి మేలు చేస్తుందో తెలుసుకుందామా.. 1. ఉల్లిపాయలో యాంటిబయోటిక్, ఏంటి సెప్టిక్, యాంటీమైక్రోబియాల్ లక్షణాలు ఉండుట వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. 2. ఉల్లిపాయలో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి.
కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉంటాయి. 3. ఉల్లిపాయ రసంతో తేనె తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, అలెర్జీ వంటి సమస్యలకు తక్షణ ఉపశమనం కలుగుతుంది. 4. ఉల్లిపాయ ముక్కను నుదుటి మీద పెడితే జ్వరాన్ని తగ్గించుకోవచ్చు. 5. ఉల్లిపాయ ముక్క వాసనను పీల్చితే ముక్కు నుండి రక్త స్రావాన్ని ఆపుతుంది. 6. ఉల్లిపాయ నిద్రలేమి, నిద్ర రుగ్మతలను నయం చేయటంలో సహాయపడుతుంది. 7. జీర్ణక్రియ సమస్యలు ఉన్నప్పుడు ఉల్లిపాయను తింటే జీర్ణ రసాల ఉత్పత్తికి సహాయపడుతుంది. 8. ఉల్లిపాయ రసం కాలిన చర్మం నయం చేయటంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. 9. ఇది తల, మెడ, పెద్దప్రేగు లో వచ్చే క్యాన్సర్ లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. 10. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచటానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా మధుమేహ చికిత్సలో సహాయపడతాయి. 11. ప్రతి రోజు ఉల్లిపాయ తింటే గుండె వ్యాధులకు కారణం అయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. 12. నువ్వుల నూనె లేదా అముదంలో ఉల్లిపాయలను వేగించి ఉపయోగిస్తే ఒంటి నొప్పులు మాయం అవుతాయి. 15. ఉల్లిపాయ రసంలో పసుపు కలిపి ముఖానికి రాస్తే నల్లని పాచెస్ లేదా పిగ్మెంట్ తొలగించటానికి సహాయపడుతుంది. 16. ఉల్లిపాయ రసంను చెవి, కంటి సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. 17. దంతాల నొప్పి, పిప్పి పన్ను నొప్పి నివారణకు ఉల్లిపాయ రసాన్ని ఉపయోగిస్తారు. 18. కొన్ని రకాల పుట్టుమచ్చలను ఉల్లిరసం ఉపయోగించి సమర్ధవంతంగా తొలగించవచ్చు. 19. ఉల్లిపాయను ఉపయోగించటం వలన మంచి జ్ఞాపకశక్తి, ఒక బలమైన నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. 20. ఉల్లిపాయ రసాన్ని తల మీద చర్మం మీద రాస్తే చుండ్రు, జుట్టు రాలే సమస్య నుండి బయటపడవచ్చు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







