డెడికేటెడ్ కోవిడ్ ట్రీట్మెంట్ కోసం 2 దుబాయ్ సెంటర్లు
- February 01, 2021
దుబాయ్:దుబాయ్ హెల్త్ అథారిటీ (డిహెచ్ఎ), అల్ ఖవానీజ్ మరియు అల్ బదా హెల్త్ సెంటర్లను డెడికేటెడ్ కోవిడ్ 19 ట్రీట్మెంట్ సెంటర్లుగా వినియోగించుకోనుంది. మెడికల్ ఎపైర్స్ డిపార్టుమెంట్ డైరెక్టర్ మరియు కన్సల్టెంట్ డాక్టర్ హనాన్ అల్ హమైది ఈ విషయాన్ని వెల్లడించారు. డిహెచ్ఎ కాంటాక్టు సెంటర్ అలాగే కోవిడ్ 19 కమాండ్ కంట్రోల్ సెంటర్ రిఫర్ చేసిన పేషెంట్లకు ఈ సెంటర్లలో చికిత్స అందిస్తారు. అత్యున్నత వైద్య చికిత్సను ఈ కేంద్రాల్లో కోవిడ్ పేషెంట్లకు అందించనున్నారు. అవసరమైన టెస్టులు, ఇతరత్రా వైద్య సౌకర్యాలూ ఇక్కడ అందుబాటులో వుంటాయి. అల్ ఖవానీస్ హెల్త్ సెంటర్ తాలూకు రెగ్యులర్ పేషెంట్లను అల్ త్వార్, నాద్ అల్ హమర్ మరియు అల్ మిజార్ హెల్త్ సెంటర్లకు పంపిస్తారు. అల్ బదా హెల్త్ సెంటర్ నుంచి అల్ మన్ఖూల్ మరియు బర్షా హెల్త్ సెంటర్లకు ఇతర పేషెంట్లను పంపించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







