ఐవీఆర్‌ఎస్ నంబర్ ప్రవేశపెడుతామని కేంద్ర రైల్వే శాఖ
- February 25, 2016
ప్రయాణికుల నుంచి నేరుగా సలహాల కోసం ప్రత్యేక ఐవీఆర్‌ఎస్ నంబర్ ప్రవేశపెడుతామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. సాధారణ ప్రయాణికులు, రైల్వేకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేకుండా చూస్తున్నామని తెలిపారు. ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి డిస్పోజబుల్ బెడ్ షీట్లు ఏర్పాటు చేస్తామన్నారు. కొత్తగా 74 రైళ్లలో ఆన్‌బోర్డ్ హౌస్‌కీపింగ్ సేవలు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. 2015-16లో ఇంధన ఆదాతో రూ. 8,720 కోట్లు మిగిలాయన్నారు.ప్రతి రైలులో వృద్ధులు, మహిళల కోసం 120 లోయర్ బెర్తులు ఏర్పాటు చేస్తామన్నారు. పీపీపీ విధానంలో 400 స్టేషన్ల ఆధునీకరణ చేస్తామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రైల్వేల ఆధునీకరణకు రూ.8.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. పారదర్శకతను పెంచేందుకు సామాజిక మాధ్యమం వినియోగంలోకి తెస్తామన్నారు. రైలు ప్రమాదాల నివారణకు కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తామన్నారు. 311 రైల్వే స్టేషన్లలో పూర్తిగా సీసీ కెమెరాలు అమర్చాం. దశలవారీగా అన్ని స్టేషన్లలో సీసీ కెమెరాలు అమర్చుతాం. గతేడాదితో పోల్చితే ప్రమాదాలు 20 శాతం తగ్గించగలిగామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







