వార్షికోత్సం పేరుతో ఒకే చోటుకి కార్ లవర్స్..చెదరగొట్టిన కువైట్ పోలీసులు
- February 07, 2021
ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ భయం వెంటాడుతోంది. తమ ప్రజలను రక్షించుకునేందుకు కువైట్ ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడుతోంది. చివరికి ఇళ్లలో జరిగే వేడుకలపై కూడా పరిమితి విధించింది. సమావేశాలు, జనసమీకరణలకు అస్సలు అనుమతించేది లేదని హెచ్చరించింది. కానీ, ఇవేం పట్టకుండా వార్షికోత్సవం పేరిట క్లాసిక్ కార్ లవర్స్ అంతా తమ కార్లతో సహా ఒక చోట గుమికూడారు. కువైట్ లోని క్లాసిక్ కార్ లవర్స్ ప్రతి ఏటా ఒక చోట కలుస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా అరేబియన్ గల్ఫ్ రోడ్ దగ్గర అంతా కలుసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకి చేరుకొని కార్ లవర్స్ అందర్ని చెదరగొట్టి అక్కడ్నుంచి పంపించి వేశారు. కోవిడ్ ఆంక్షలు అమలులో ఉన్నందున ఎలాంటి గ్యాదరింగ్ కు అనుమతి ఇచ్చేది లేదని మరోసారి పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







