మిస్ ఇండియా టైటిల్ గెలిచిన తెలంగాణా యువతి..!
- February 11, 2021
‘మిస్ ఇండియా 2020’ టైటిల్ తెలుగమ్మాయిని వరించింది. బుధవారం అంగరంగ వైభవంగా జరిగిన వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీలో హైదరాబాద్‌కు చెందిన మానస వారణాసి విజేతగా నిలిచింది.
2021లో జరగబోయే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున మానస పాల్గొననుంది. ఇక వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా 2020 రన్నరప్‌గా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాన్యా సింగ్, మిస్ గ్రాండ్ ఇండియా 2020గా హర్యానాకు చెందిన మానికా షియోఖండ్ నిలిచారు.
మిస్ ఇండియా 2019 సుమన్ రావు మానసకు కిరీటాన్ని బహూకరించారు. ఈ పోటీలకు నటులు నేహా ధూపియా, చిత్రాంగద సింగ్, పుల్కిత్ సామ్రట్, ప్రముఖ డిజైనర్లు ఫాల్గుని, షేన్ పికాక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
తాజా వార్తలు
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం







