లైసెన్స్ లేని వారికి వాహనం ఇవ్వొద్దు
- February 25, 2016
డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనం ఇస్తే మీకు ఇబ్బందులు తప్పవు. వాహనం నడిపిన వారితో పాటు యజమానికీ జైలు శిక్ష తప్పదు. సుప్రీంకోర్టు కమిటీ నియమాలను ఖచ్చితంగా అమలు చేయడంలో భాగంగా నగర ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే నగర ట్రాఫిక్, ఆర్టీఏ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నిబంధనలు పాటించని వారికి చట్ట ప్రకారం జైలు శిక్ష పడేలా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. సుప్రీంకోర్టు కమిటీ సూచనలను అమలు చేయడంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న చర్యలు, ఉల్లంఘనదారుల శిక్షలపై న్యాయ నిపుణులతో చర్చించారు. ఈ విషయాలను స్థానిక న్యాయస్థానాల దృష్టికి కూడా తీసికెళ్లారు. లైసెన్స్‌లు లేని వారు తప్పని సరిగా వాటిని పొందేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టాలని ఆర్టీఏ విభాగాన్ని కోరారు.నిబంధనలు పాటించని వారిపై ట్రాఫిక్ విభాగం చలనాలు విధిస్తోంది. అయితే కోర్టులో హాజరు పరిస్తే తప్పని సరిగా ఉల్లంఘనదారులకు శిక్షలు పడేలా ఉండాలని ట్రాఫిక్ అధికారులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని న్యాయస్థానాల దృష్టికి తీసికెళ్లి వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే అంతే... డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఏ ఒక్కరూ కూడా వాహనం నడుపవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లైసెన్స్ లేని వారితో పాటు లైసెన్స్ సస్పెండ్ అయిన వారు వాహనం నడుపేందుకు వీలు లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారిని లైసెన్స్‌లు సస్పెండ్ చేయాలంటూ ఆర్టీఏకు 80 మంది పేర్లను సూచిస్తూ నగర ట్రాఫిక్ అధికారులు లేఖలు పంపించారు. దీని ఆధారంగా లైసెన్స్ దారులకు నోటీసులిచ్చి వాటిని ఆర్టీఏ సస్పెండ్ చేస్తోంది. ఫిబ్రవరి చివరి వారం నుంచి నిబంధనలను మరింత కఠిన తరం చేస్తున్నారు. లైసెన్స్ లేని వారు వాహనం నడిపి పట్టుబడితే ఇక జైలుకు వెళ్లాల్సిందే.ఐదు నిబంధనలు కూడా కఠినతరం లైసెన్స్ లేకుండా, ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్, మద్యం తాగి, సిగ్నల్ జంపింగ్, ఓవర్‌స్పీడ్, ఓవర్ లోడింగ్ ఉల్లంఘనలపై ఇక నుంచి కఠినంగా వ్యవహరించనున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







