100 స్టేషన్లలో వైఫై....
- February 25, 2016
గూగుల్ సహకారంతోనే.. వచ్చే రెండేళ్లలో 400 స్టేషన్లలో ఏర్పాటు న్యూఢిల్లీ: ఈ ఏడాది 100 స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నట్టు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. అలాగే వచ్చే రెండేళ్లలో 400 రైల్వేస్టేషన్లలో ఈ సదుపాయాన్ని కల్పి స్తామన్నారు. గూగుల్‌తో కలసి భారత రైల్వే.. వైఫై సదుపాయాన్ని కల్పించడానికి అవసరమైన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్టు పేర్కొన్నారు.గత డిసెంబర్లో భారత్‌కు వచ్చిన గూగు ల్ సీఈవో సుందర్ పిచాయ్.. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించడానికి రైల్వే సహకారంతో 400 స్టేషన్లలో వైఫై కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన విషయం తెలిసిందే.ఈ ఏడాదే ట్రాక్ మేనేజ్మెంట్ సిస్టం అప్లికేషన్‌ను కూడా ప్రారంభించనున్నట్టు ప్రభు వెల్లడించారు. దీనిద్వారా ట్రాక్‌ల తనిఖీలు, పర్యవేక్షణపై నిరంతరాయంగా నిఘా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







