ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగానికి WHO అనుమతి
- February 16, 2021
జెనీవా:ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రెండు కరోనా టీకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఒకటి భారత్‌లోని సీరం ఇనిస్టిట్యూట్‌లో ఉత్పత్తి అవుతున్న ఆక్స్ఫర్డ్ఆస్ట్రాజెనెకా టీకా కాగా, రెండోది దక్షిణ కొరియాకు చెందిన ఆస్ట్రాజెనెకాఎస్కే బయో కంపెనీ తయారు చేసినది. ఈ రెండింటి వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ నిన్న అనుమతి ఇచ్చింది.
ఈ సందర్భంగా ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ మాట్లాడుతూ.. ఈ రెండు టీకాలకు అనుమతి ఇవ్వడంతో కోవ్యాక్స్ ప్రోగ్రాం తరపున ప్రపంచ దేశాలకు టీకా అందించేందుకు మార్గం సుగమం అయిందన్నారు. కోవ్యాక్స్ పేరిట ప్రపంచ ఆరోగ్య సంస్థ పేద దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ను అందించే కార్యక్రమం చేపట్టింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు కోవ్యాక్స్ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఇవన్నీ పేద దేశాలకు వ్యాక్సిన్ అందించేందుకు ముందుకొచ్చాయి.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







