స్మార్ట్ ఫోన్లలో ఎమర్జన్సీ అలర్ట్ సిస్టమ్ ట్రయల్

- February 16, 2021 , by Maagulf
స్మార్ట్ ఫోన్లలో  ఎమర్జన్సీ అలర్ట్ సిస్టమ్ ట్రయల్

రియాద్:అత్యవసర సందర్భాల్లో ఉపయోగపడేలా ఫోన్ వార్నింగ్స్ సిస్టమ్‌ని సౌదీ అరేబియా ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది.సోమవారం ఈ ట్రయల్ ప్రారంభమవుతుంది.సౌదీ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ మరియు కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ వార్నింగ్స్ ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటల నుంచి బ్రాడ్‌కాస్ట్ అవుతాయి.ఫిబ్రవరి 22 వరకు ఇది కొనసాగుతుంది. బుకాయక్, బహ్రా, కున్ఫుదా సహా కొన్ని గవర్నరేట్లలో ఈ వార్నింగ్ సిస్టమ్ ట్రయల్ జరుగుతుంది.స్మార్ట్ ఫోన్ వినియోగదారులు తమ ఫోన్లు అప్‌డేట్స్‌కి అనుగుణంగా వున్నాయో లేదో సరిచూసుకోవాలి. అత్యవసర పరిస్థితులకు సంబంధించి పౌరులు అలాగే నివాసితుల్ని అప్రమత్తం చేసేలా ఈ వార్నింగ్ సిస్టమ్ రూపొందించబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com