జులై నాటికి ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్.. జో బైడెన్
- February 17, 2021
వాషింగ్టన్:అమెరికాలోని ప్రజలందరికి జులై నాటికి వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియను పూర్తి చేస్తామని అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు.తొలుత ఏప్రిల్ లోగానే ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని అమెరికా అంచనా వేసినప్పటికీ, టీకాల లభ్యత, పంపిణీలో నెలకొన్న కొన్ని అవాంతరాల నేపథ్యంలో లక్ష్యాన్ని చేరుకునేందుకు మరో మూడు నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజాగా సీఎన్ఎన్ టౌన్ హాల్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్న బైడెన్ ను,వ్యాక్సినేషన్ ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించగా, జులై చివరి నాటికి పూర్తవుతుందని తెలిపారు.‘జులై నాటికి 60 కోట్ల డోస్ లు అందుబాటులోకి వస్తాయి.వాటితో ప్రతి అమెరికన్ కూ టీకా వేయడం పూర్తవుతుంది’ అని ఆయన స్పష్టం చేశారు.
పాఠశాలలకు చిన్నారులను సాధ్యమైనంత త్వరగా పంపించే పరిస్థితులు దేశంలో ఏర్పడాలని కోరుకుంటున్నట్టు కూడా ఆయన తెలిపారు.వ్యాక్సినేషన్ తరువాతే ఇది సాకారం అవుతుందని, పిల్లల భవిష్యత్తు ప్రభావితం కారాదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని బైడెన్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో అమెరికాలో తిరిగి సాధారణ జీవన పరిస్థితులు ఎప్పటికి ఏర్పడతాయన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, తదుపరి క్రిస్మస్ సీజన్ నాటికి అంతా సర్దుకుంటుందని తెలిపారు. ఈ సంవత్సరం చివరికి దేశంలోని అతికొద్ది మంది మాత్రమే సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించి తిరిగే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్‌గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్‌కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...
- చక్కెర వినియోగంపై చిన్నారులకు GTA అవగాహన..!!
- పసికందు మృతి కేసు.. తల్లిదండ్రులకు మూడేళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఒమాన్‌లో అడ్వెంచర్ టూరిస్టులకు హెచ్చరిక..!!
- దుబాయ్‌లో ట్రాఫిక్‌కు చెక్.. 4 కీలక జంక్షన్లలో కొత్త బ్రిడ్జిలు, టన్నెల్స్..!!







