ఏఆర్ సిబ్బందిదే ఉన్నత బాధ్యత: రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు
- February 17, 2021_1613544002.jpg)
హైదరాబాద్: అంబేర్పెట్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఈరోజు రాచకొండ ఎఆర్ (సాయుధ పోలీస్ దళాలు) డీ మొబిలైజేషన్ పరేడ్ లో రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఆర్ సిబ్బంది ఉన్నతమైన బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఏఆర్ అనేది డిపార్ట్మెంట్ కి గుండెకాయ అని అన్నారు.రాష్ట్రం ఈరోజు ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారంటే అందులో తమ పాత్ర ముఖ్యంగా ఉందని చెప్పుకోవడం గర్వంగా ఉందన్నారు. పోలీసులు ప్రతిరోజూ కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ కావలని నేర్చుకున్న విషయాలను వృత్తిపరంగా ఉపయోగించుకోవాలన్నారు. ప్రాణత్యాగాలు చేసేది మన డిపార్ట్ మెంటే అని గుర్తు చేశారు.ఏఆర్ సిబ్బందికి క్రమశిక్షణ ముఖ్యం అని అన్నారు. ప్రతీ ఒక్క విభాగంలో ఏఆర్ పాత్ర ఉందన్నారు. కోవిడ్ – 19 కరోనా, వరదల సమయాల్లో ఏఆర్ సిబ్బంది చాలా బాగా పని చేశారన్నారు.ఏఆర్ సిబ్బంది ఫిట్నెస్ ను కాపాడుకోవాలన్నారు. రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకోవాలన్నారు.వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు.రోజులో కొంత సమయాన్ని వ్యాయామం, యోగా కోసం కేటాయించుకోవాలన్నారు. అనంతరం డాగ్ స్క్వార్డ్ చేసిన విన్యాసాలు తిలకించారు. ఆందోళనలను (గుంపులుగా వస్తే ఎలా అడ్డుకోవాలి, అదే ఇద్దరిద్దరిని ఎలా నిలువరించాలి) ఎలా అదుపులోకి తేవాలి, టెర్రరిస్టులు దాడులు చేస్తే ఎలా అడ్డుకోవాలి అనేదానిపై డెమో చేసి ఆకట్టుకున్నారు. ఏఆర్ సిబ్బందిని మొబిలైజ్/ సమీకరించిన ఏడీసీపీలు సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ శమీర్, శంకర్ నాయక్, వెంకటేశ్వర్లును అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఏసీపీలు నాగేంద్రుడు, శ్రీనివాస్, శ్రీను ఆర్ఐలు, పోలీసు అధికారుల సంఘం ప్రతినిధి జి.కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు
- జీఎస్టీ రాయితీలపై కేంద్రం పర్యవేక్షణ
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు