సానియా జోడీ రష్యా చేతిలో ఓటమి
- February 26, 2016
ప్రపంచ మహిళల టెన్నిస్ డబుల్స్ నంబర్ వన్ జోడీ చరిత్రకు మరికొన్ని అడుగుల దూరంలో నిలిచిపోయింది. ఖతార్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో ఓటమితో మహిళల డబుల్స్ లో 41 వరుస విజయాల జైత్రయాత్రకు బ్రేక్ పడింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్స్ లో సానియా మిర్జా(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) 2-6, 6-4, 10-5 తేడాతో రష్యా ద్వయం ఎలినా వెస్నినా- డారియా కసాట్కినా చేతిలో ఓటమి పాలయ్యారు. గతేడాది నుంచి ఇప్పటివరకు 13 టోర్నమెంట్లలో ఓటమనేది లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్-స్విస్ జోడీకి పెద్ద షాక్ తగిలింది.1994 తర్వాత వరుసగా ఎక్కువ మ్యాచ్‌లు(28) గెలిచిన రికార్డును మాత్రమే అందుకున్న సానియా-హింగిస్ ద్వయం, 1990లో జానా నవోత్నా-ఎలీనా సుకోవా నెలకొల్పిన 44 మ్యాచ్‌ల రికార్డును ఛేదించే క్రమంలో కేవలం కొన్ని అడుగులదూరంలో(41 విజయాలు) వెనుదిరిగారు.
దీంతో సానియా-హింగిస్ లు మహిళల డబుల్స్ లో అత్యధిక వరుస విజయాల రికార్డులో మూడో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. కాగా, మహిళల డబుల్స్‌లో ప్రపంచ రికార్డు లక్ష్యం మాత్రం చాలా పెద్దగా ఉంది. 1983- 85 మధ్య కాలంలో మార్టినా నవ్రతిలోవా-ఫామ్ ష్రివర్‌లు వరుసగా 109 మ్యాచ్‌ల్లో నెగ్గడం ఆల్ టైమ్ రికార్డుగా ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







