IPL 2021 ఆక్షన్: అమ్ముడుపోయిన ఆటగాళ్ల వివరాలు...

- February 18, 2021 , by Maagulf
IPL 2021 ఆక్షన్: అమ్ముడుపోయిన ఆటగాళ్ల వివరాలు...

చెన్నై:ఐపీఎల్ 2021 మినీ వేలంలో ఫారిన్ ప్లేయర్లు దుమ్ములేపుతున్నారు.ముఖ్యంగా ఆల్‌రౌండర్లు, ఫాస్ట్ బౌలర్లపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరీస్ ఏకంగా రూ.16.25 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయి ఐపీఎల్ వేలంలోనే ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాడు. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతన్ని ఇంత భారీ ధరను వెచ్చించి రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. ఇక గ్లేన్ మ్యాక్స్‌వెల్ రూ.14.25 కోట్లు, షకీబ్ అల్ హసన్ 3.20 కోట్లు, మోయిన్ అలీ రూ. 7 కోట్లు, కృష్ణ ప్ప గౌతమ్ రూ.9.25 కోట్లు భారీ ధరకు అమ్ముడుపోయారు. కైల్ జేమీసన్ కూడా రూ. 15 కోట్ల భారీ ధర పలికాడు. అమ్ముడు పోయిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిద్దాం.

అమ్ముడుపోయిన ఆటగాళ్లు

1. స్టీవ్ స్మిత్ (ఢిల్లీ క్యాపిటల్స్)- రూ. 2.20 కోట్లు

2. గ్లేన్ మ్యాక్స్‌వెల్ (ఆర్‌సీబీ)-రూ. 14.25 కోట్లు

3. షకీబ్ అల్ హసన్(కేకేఆర్)- రూ.3.20 కోట్లు

4. మోయిన్ అలీ(సీఎస్‌కే)-రూ. 7 కోట్లు

5. శివమ్ దూబే(రాజస్థాన్)-రూ. 4.40 కోట్లు

6.క్రిస్ మోరీస్(రాజస్థాన్)-రూ.16.25 కోట్లు

7. డేవిడ్ మలాన్(పంజాబ్)-రూ.1.50 కోట్లు

8. ఆడమ్ మిల్నే(ముంబై)-రూ. 3.20 కోట్లు

9. ముస్తాఫిజుర్ రెహ్మాన్(రాజస్థాన్)- రూ. కోటి

10. జై రిచర్డ్సన్(పంజాబ్)- రూ.14 కోట్లు

11. నాథన్ కౌల్టర్ నైల్(ముంబై)-రూ. 5 కోట్లు

12. ఉమేశ్ యాదవ్(ఢిల్లీ)-రూ. కోటి

13. పియూష్ చావ్లా(ముంబై)-రూ.2.40 కోట్లు

14. సచిన్ బేబీ(ఆర్‌సీబీ)-రూ.20 లక్షలు

15. రజత్ పటిదర్(ఆర్‌సీబీ)-రూ.20 లక్షలు

16. రిపల్ పటేల్(ఢిల్లీ)-రూ.20 లక్షలు

17. షారూఖ్ ఖాన్(పంజాబ్)- రూ.5.25 కోట్లు

18. కృష్ణప్ప గౌతమ్(చెన్నై)- రూ.9.25 కోట్లు

19. విష్ణు వినోద్ (ఢిల్లీ)- రూ.20 లక్షలు

20. షెల్డన్ జాక్సన్ (కోల్‌కతా)-రూ. 20 లక్షలు

21. మహ్మద్ అజారుద్దీన్(ఆర్‌సీబీ)- రూ.20 లక్షలు

22. లుక్మాన్ హుస్సేన్ (ఢిల్లీ)- రూ.20 లక్షలు

23. చేతన్ సకారియా (రాజస్థాన్)-రూ. 20 లక్షలు

24. రిలే మెరెదిత్ (పంజాబ్)-రూ. 8 కోట్లు

25. సిద్దార్థ్ (ఢిల్లీ)- రూ. 20 లక్షలు

26. జగదీషా సుచిత్ (హైదరాబాద్)- రూ. 30 లక్షలు

27. కరియప్పా(రాజస్థాన్)- రూ. 20 లక్షలు

28. చతేశ్వర్ పుజారా (చెన్నై)-రూ. 50 లక్షలు

29. కైల్ జేమీసన్ (ఆర్‌సీబీ)- రూ. 15 కోట్లు

30. టామ్ కరన్ (ఢిల్లీ)-రూ. 5.25 కోట్లు

31. హెన్రీక్స్ (పంజాబ్)- రూ.4.20 కోట్లు

32. జలజ్ సక్సెనా (పంజాబ్)- రూ.30 లక్షలు

33. ఉత్కర్ష్ సింగ్( పంజాబ్)- రూ.20 లక్షలు

34. వైభవ్ అరోరా (కోల్‌కతా)- రూ. 20 లక్షలు

35. ఫాబియన్ అలెన్ (పంజాబ్)- రూ. 75 లక్షలు

36. డానియల్ క్రిస్టియన్ (ఆర్‌సీబీ)- రూ.4.8 కోట్లు

37. లియమ్ లివింగ్ స్టోన్ (ఆర్‌సీబీ)- రూ. 75 లక్షలు

38. సుయాశ్ ప్రభుదేశాయ్ (ఆర్‌సీబీ)- రూ. 20 లక్షలు

39. కేఎస్ భరత్ (ఆర్‌సీబీ)- రూ. 20 లక్షలు

40. హరిశంకర్ రెడ్డి (చెన్నై)- రూ. 20 లక్షలు

41. కుల్దీప్ యాదవ్ (రాజస్థాన్)- రూ.20 లక్షలు

42. జేమ్స్ నీషమ్ (ముంబై)- రూ. 50 లక్షలు

43. యుద్‌వీ చరక్ (ముంబై)- రూ. 20 లక్షలు

44. భగత్ వర్మ (చెన్నై)- రూ. 20 లక్షలు

45. మార్కో జాన్‌సెన్ (ముంబై)- రూ. 20 లక్షలు

46. కరుణ్ నాయర్ (కోల్‌కతా)- రూ. 50 లక్షలు

47. కేదార్ జాదవ్ (హైదరాబాద్)- రూ. 2 కోట్లు

48. సామ్ బిల్లింగ్స్ (ఢిల్లీ)- రూ. 2 కోట్లు

49. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (హైదరాబాద్) రూ. 1.5 కోట్లు

50. హర్భజన్ సింగ్ (కోల్‌కతా)- రూ. 2 కోట్లు

51. హరి నిశాంత్ (చెన్నై)- రూ. 20 లక్షలు

52. బెన్ కట్టింగ్ (కోల్‌కతా)- రూ. 75 లక్షలు

53. వెంకటేశ్ అయ్యర్ (కోల్‌కతా)- రూ. 20 లక్షలు

54. పవన్ నేగీ (కోల్‌కతా)- రూ. 50 లక్షలు

55. ఆకాశ్ సింగ్ (రాజస్థాన్)- రూ.20 లక్షలు

56. అర్జున్ టెండూల్కర్ (ముంబై)-రూ. 20 లక్షలు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com