సెనగపప్పు చికెన్ ఖీమా
- February 19, 2021
కావలసినవి: సెనగపప్పు - ఒక కప్పు, చికెన్ ఖీమా - అరకేజీ, నూనె - తగినంత, ఉల్లిపాయ - ఒకటి, లవంగాలు - 4, నల్లమిరియాలు - నాలుగైదు, పచ్చిమిర్చి - రెండు, పసుపు - అర టీస్పూన్, కారం - ఒకటిన్నర టీస్పూన్, ధనియాల పొడి - ఒక టేబుల్‌స్పూన్, జీలకర్రపొడి - అర టీస్పూన్, గరంమసాల - ఒక టీస్పూన్, అల్లంవెల్లుల్లి పేస్టు - 2 టీస్పూన్లు, పెరుగు - ఒక కప్పు, నెయ్యి - 2 టేబుల్‌స్పూన్లు, పుదీనా - అరకప్పు, నిమ్మకాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - ఒక కట్ట.
తయారీ: పాన్‌లో నూనె వేసి లవంగాలు, మిరియాలు వేగించాలి.
పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మరో మూడు నాలుగు నిమిషాలు వేగనివ్వాలి.
నానబెట్టుకున్న సెనగపప్పును వేసి కలుపుకోవాలి.
కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్రపొడి, గరంమసాల, ఉప్పు వేసి కలియబెట్టాలి.
కొద్దిగా నీళ్లు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి. మూతపెట్టి పావుగంట పాటు ఉడికించాలి.
ఇప్పుడు చికెన్ వేసి కలుపుకోవాలి.పెరుగు, గరంమసాల, నెయ్యి, పుదీనా, కొద్దిగా నిమ్మరసం వేసి మరో పావుగంట ఉడికించాలి.చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్‌కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!