మోడీ ప్రపోసల్ ను సపోర్ట్ చేసిన పాక్
- February 19, 2021
భవిష్యత్తులో వచ్చే వ్యాధులను దృష్టిలో ఉంచుకుని దేశాలు పరస్పరం సహకరించుకోవాలని, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఒక దేశంలోని డాక్టర్లు మరో దేశానికి వెళ్లడానికి వారికోసం ప్రత్యేక వీసాలను రూపొందించాలని ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునకు పాకిస్తాన్ స్వాగతించింది.
కొవిడ్-19తో వచ్చిన సమస్యలను, అనుభవాన్ని, వ్యాధి సంబంధిత అంశాల్ని చర్చించడానికి భారత్..సార్క్‌తో పాటు మారిషస్, సీశెల్స్ దేశాల నిపుణులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మాట్లాడిన మోడీ.. కొవిడ్-19 వాక్సిన్ సమాచారాన్ని పంచుకొని, టీకాను మరింత మెరుగ్గా మన దేశాల ప్రజలకు ఇవ్వడానికి ప్రాంతీయ కార్యచరణను రూపొందించుకోలేమా? వ్యాధిసంబంధిత సాంకేతికత సాయంతో భవిష్యత్తులో మహమ్మారులు రాకుండా చూసేందుకు ప్రాంతీయ కార్యచరణనను ఏర్పరచుకోలేమా? భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశాలు పరస్పర సహకారంతో, ప్రత్యేక కార్యచరణను రూపొందించుకోవాలి.
ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఒక దేశంలోని వైద్యులు మరో దేశానికి వెంటనే వెళ్లడానికి వీలుగా వారికోసం ప్రత్యేక వీసాలు తీసుకురావాలని సమావేశంలో పాల్గొన్న దేశాలను ప్రధాని కోరారు. అంతేకాకుండా దేశాల విదేశాంగ మంత్రులు చర్చించుకుని ఎయిర్ అంబులెన్స్‌లకు సంబంధించి వైద్యసంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని మోడీ సూచించారు. అంతేకాకుండా దేశాల మధ్య ఆరోగ్య సంబంధిత పథకాల సమాచారాన్ని పంచుకోవాలని ప్రధాని కోరారు. మోడీ ఇచ్చిన ఐదు సూచనలకు పాకిస్తాన్ తో సహా పది దేశాలు మద్దతు పలికాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







