గ్రీన్ కార్డుల జారీని సులభతరం చేయనున్న అమెరికా ప్రభుత్వం
- February 19, 2021
అమెరికాలోని భారతీయులకు పండగలాంటి వార్త. గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ప్రవాసులకు జో బైడెన్ సర్కారు శుభవార్తను చెప్పింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియపై దృష్టి సారించారు. గ్రీన్ కార్డుల జారీని సులభతరం చేయడమే కాకుండా వీలయినంత ఎక్కువ మందికి అమెరికా పౌరసత్వాన్ని అందించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ సవరణ బిల్లును కూడా గురువారం ఆ దేశ చట్ట సభలో ప్రవేశ పెట్టారు. దీంతో గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది భారతీయులకే కాకుండా, ప్రపంచ దేశాల నుంచి ఉపాధి నిమిత్తం వచ్చి అమెరికాలో ఉంటున్న విదేశీయులకు కూడా మేలు కలగనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కోటి మందికి పైగా అక్రమ వలసదారులకు అమెరికా పౌరసత్వం ఇస్తానని గత ఎన్నికల ప్రచారంలో జో బైడెన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసి నెల రోజులు కూడా గడవక ముందే బైడెన్ ఆ హామీని నెరవేర్చే పనిలో పడ్డారు. ఎక్కువ మందికి గ్రీన్ కార్డులను జారీ చేసేలా ఇమ్మిగ్రేషన్ చట్టానికి సవరణ బిల్లును చట్ట సభలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్ బాబ్ మెనెండేజ్, ప్రతినిధులు సభ సభ్యురాలు లిండా సాంచెజ్ ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ బిల్లు వల్ల భారీ స్థాయిలో భారతీయులకు ప్రయోజనం చేకూరుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటి వరకు దేశాల వారీగా ప్రతియేటా పరిమిత సంఖ్యలోనే గ్రీన్ కార్డులను జారీ చేసే విధానాన్ని అమలు చేస్తూ వచ్చారు. ఈ బిల్లు సభలో ఆమోదం పొందితే ఈ విధానానికి పులుస్టాప్ పడనుంది. దేశాల వారీగా విధించిన 'పరిమిత సంఖ్యలో గ్రీన్ కార్డుల' జారీని పక్కన పెట్టి, వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వీలయినంత ఎక్కువ మందికి పౌరసత్వం కల్పిస్తారు. హెచ్ 1బీ వీసాతో అమెరికాకు వచ్చే వారి పిల్లల్లో ఎవరికైనా 21ఏళ్లు ఉంటే ఆ పిల్లలను అమెరికాలోకి రానిచ్చేవారు కాదు. ఇప్పుడు ఆ నిబంధనను రద్దు చేయాలని బిల్లులో పొందుపరిచారు. హెచ్1బీ ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగాలు చేయొచ్చన నిబంధనను కూడా అందులో చేర్చారు.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్